

అభినందనలు తెలిపిన వీరన్న చౌదరి
జనం న్యూస్ సెప్టెంబర్ 22 ముమ్మిడివరం ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు సరుకులు అందుబాటులో ఉండేలాగా నిత్యావసర వస్తువులు హెయిర్,ఆయిల్,టూత్ పేస్ట్,సబ్బులు ఎలక్ట్రానిక్ ఏసీ,టీవీ వాషింగ్ మిషన్ రెండు చక్రాల వాహనాలు పెట్రోల్ డీజిల్ విద్యారంగానికి విద్యార్థులకు స్టేషనరీ రైతులకు వ్యవసాయ పనిముట్లు ప్రజలకు అనారోగ్యానికి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పై భారీగా తగ్గింపు ,వైద్య రంగంలో 33 ప్రాణ రక్షక మందులు పన్ను నుంచి మినహాయింపు.సామాన్యులకు కిరాణా,175 వస్తువులపై జీఎస్టీస్ శ్లాబులను తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవటం చాలా మంచి శుభ సూచకమని రాజానగరం బీజేపీ ఇన్ ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య జీవన ప్రమాణాలను మెరుగు
పరిచేందుకు మధ్య తరగతి వారికి లబ్ధి చేకూర్చేందుకు, ఎంత గానో ఉప యోగ పడుతుందన్నారు,కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన వస్తు సేవల పన్ను కౌన్సిల్ 56వ సమావేశంలో ప్రతిపాదించారు కొత్త పన్ను రేట్లు ఈరోజు నుంచి అమల్లోకి వస్తాయి.ఇది ప్రజలకు దసరా,దీపావళి కానుకగా నిర్ణయించి శుభవార్త చెప్పిన ప్రదానమంత్రి నరేంద్రమోదీ కి కృతజ్ఞతలు తెలిపారు