Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

నందలూరు:మండలంలోని టంగుటూరు వద్ద చెయ్యరు నదిలో ప్రవహిస్తున్న నీటి వల్ల టంగుటూరు – ఓబిలి మధ్య రోడ్డు కొట్టుకుపోవడంతో ఆదివారం రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి , ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి లు పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ టంగుటూరు – ఓబిలి మధ్య ఉన్నటువంటి రహదారికొట్టుకుపోవడంతో రెండు మండలాల ప్రజల ప్రయాణాలకు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు అయినటువంటి ఆర్ అండ్ బి ఎస్ ఈ తో ఫోన్ లో మాట్లాడి వెంటనే తాత్కాలికంగా అయినా రోడ్డు ఏర్పాటు చేయాలి అని అన్నారు. గతంలో 2012లో తన సొంత నిధులతో రోడ్డు మొదటిగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ తర్వాత మళ్లీ 25 లక్షల రూపాయల నిధులతో తూములు ఏర్పాటు చేసి రోడ్డు ఏర్పాటుచేశామన్నారు. ఇప్పుడు మళ్లీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోయిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుని పోయి వెంటనే శాశ్వత పరిష్కారంగా మంతెన నిర్మించాలని అన్నారు. అవసరమైతే రాజ్యసభ సభ్యులుమేడా,రఘునాథ రెడ్డి , పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహకారంతో రోడ్డు నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల వైసిపి నాయకులు పాల్గొన్నారు