Listen to this article

బిచ్కుంద సెప్టెంబర్ 22 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద గ్రామానికి చెందిన దుబ్బ క్రాంతికుమార్ తెలుగు ఉపాధ్యాయుడు గా ZPHS ఫత్లాపూర్ గ్రామం లో విధులు నిర్వహిస్తున్నాడు. అతను రాసిన గెలుపు సంతకం పుస్తకానికి వసుంధర విజ్ఞాన వికాస మండలి వారు కామారెడ్డి జిల్లా నుండి ఎంపికచేసి సోమవారం రోజున హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సంస్కృతి క శాఖ సంచాలకులు చేతుల మీదుగా జాతీయ దాశరథి సాహిత్య పురస్కార్ అవార్డ్ అందుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు, జిల్లా సాహిత్య అభిమానులు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు