Listen to this article

జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలంలోని వసంతాపూర్ గ్రామ శివారులో నాలిక రాజు వ్యవసాయ పొలాల్లో మొగిపురుగు ఉదృతంగా ఆశించడంతో బాయర్ కంపనీ వారి వయోగో మందును పిచికారి చేయించారు. ఈ మందు మొగిపురుగును సమర్థవంతంగా నివారిస్తూ వరి పైరు పచ్చగా ఏపుగా పెరిగి ఆరోగ్యవంతమైన పిలకలతో చూడముచ్చటగా ఉందని ఈ వరి పంట క్షేత్రమును చూసిన వివిధ గ్రామాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మందు పని చేసే విధానం గురించి బాయర్ కంపెనీ ప్రతినిధి సి సి యం శివేష్ రేడ్డి రైతు సోదరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట మండల పరిధిలోని గ్రామాల రైతులు కంపెనీ ప్రతినిధులు మండల కిరణ్, పిల్లెల శివసాయి. ఎం బ డి పరమేష్ రైతులు తదితరులు పాల్గొన్నారు…..