Listen to this article

MP సురేష్ సర్కార్. సహకారంతో లబ్ధిదారులకు రూ. 60,000- విలువ గల చెక్కును పంపిణీ చేసిన AITF తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ ,

జనం న్యూస్ సెప్టెంబర్ 23

పేదల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నిజమైన సంజీవనిగా మారిందని జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండల్ మోతిమాత మందిరం దగ్గర నివాసముంటున్న దేవి బాయ్ ధన్సింగ్ రాథోడ్ కుమంగళవారం ఆయన నివాసంలో రూ. 60,000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా AITF తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినయ్ పవర్ , మాట్లాడుతూ
“ప్రజల ఆరోగ్యం కాపాడటం, పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి నిజమైన వరప్రసాదం, ఇప్పటి వరకు వందలాది కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాయన్నారు. ప్రతి అర్హుడికి సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ
“ఈ ఆర్థిక సహాయం మా కుటుంబానికి పెద్ద ఊరటను ఇచ్చిందని, చికిత్స ఖర్చుల భారాన్ని తగ్గించినందుకు MP సురేష్ షెట్కర్ గారికి కృతజ్ఞతలు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు” తెలిపారు. ఈ కార్యక్రమంలో AITF మొగుడంపల్లి మండల్ ఇంచార్జ్ రవీందర్ రాథోడ్ , యువ నాయకుడు గోపాల్ పవర్ , బాబు పవర్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది