మృతి చెందిన తోటి పిఆర్వో కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత….
జనం న్యూస్ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రిపోర్టర్ ఠాగూర్ సెప్టెంబర్ 23 :
ఊరుకులు పరుగుల జీవితంలో నిత్యం తమతో పాటు కలిసి తిరిగిన మిత్రుడు ఆనారోగ్యంతో మృతి చెందడంతో తోటి ప్రవెట్ హస్పిటల్సు అసోసియేషన్ పిఆర్వో యూనియన్లు సభ్యులంతా కలిసి మానవత్వం చాటుకున్నారు.మండల పరిధిలోని తిమ్మారుపేట గ్రామానికి చెందిన ఇసంపల్లి క్రిష్ణ ఇటివలే ఆనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన దశదిన కార్యక్రమానికి ప్రవెట్ హస్పిటల్సు పిఆర్వో ల యూనియన్ జిల్లా అద్యక్షుడు సింగారాపు శ్రీనివాస్ అద్వర్యం లో 32 వేల రూపాయలు యూనియన్ సభ్యులతో కలిసి క్రిష్ణ కూమారుడు కి మంగళవారం అందజేశారు.ఈసందర్భంగా జిల్లా అద్యక్షుడు సింగారాపు శ్రీను మాట్లాడుతూ ప్రతి పిఆర్వో వ్రుత్తిలో ఎన్ని సమస్యలు ఉన్న ధైర్యంగా ఎదుర్కొవాలని పిఆర్వో లు రౌండ్స్ కి వెళ్లేటప్పుడు హెల్మెట్ ద్విచక్ర వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట తీసుకొని వెళ్లాలని సూచించారు. పిఆర్వో లకు ఏ ఇబ్బందులు ఉన్న తమ సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని హమీ ఇచ్చారు.అదేవిధంగా గతంలో మరణించిన పిఆర్వో లకు సైతం తమ సంఘం అద్వర్యం లో ఆర్థిక సహయం చేసి ఆదుకున్నామని తెలిపారు.ఆర్థిక సహయం చేసిన ప్రవెట్ హస్పిటల్సు అసోసియేషన్ కమిటీ కి ఇసంపల్లి క్రిష్ణ కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు అభినందించారు.ముందుగా క్రిష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రవెట్ హస్పిటల్సు పిఆర్వో అసోసియేషన్ సభ్యులు వల్లభనేని విజయ్, కంకణాల రామారావు, షేక్ జానీ పాషా, బానోతు కృష్ణ, ఆదెర్ల కళ్యాణ్, మధు, శివ,సంపత్ , రాజేష్, జవీద్,ఉదయ్, రత్నం, శ్రావణ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.


