బుద్ద వనం ముఖ్య అధికారులు హాజరు కాలేక వెల వెల పోయిన సంబరాలు..
జనం న్యూస్- సెప్టెంబర్ 24- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ టూరిజం బుద్ధవనం లో మంగళవారంసాయంత్రం
బతుకమ్మ సంబరాలకు బుద్ద వనం ముఖ్య అధికారులు ఎవరూ హాజరు కాలేదు దీనితో స్థానికులు బతుకమ్మ సంబరాలు ఎవరికి వారు నిర్వహించుకుని వెను తిరిగారు సంబరాలకు బుద్ధవనం ముఖ్య అధికారులు ఎవరు లేక వెలవెల పోయింది.బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ముందురోజు భారీగా ప్రచారం నిర్వహించినా ఆయనే హాజరు కాకపోవడం గమనార్హం.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21 నుండి 30వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సందర్బంగా తెలంగాణ సంస్కృతి అయిన బతుకమ్మ పండుగను ప్రపంచస్థాయిలో ప్రచారం కలిగించే విధంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసినా
ఈ కార్యక్రమానికి బుద్ధవనం ముఖ్య అధికారులు ఎవరూ లేకపోవడం విమర్శలకు తావిచ్చింది.


