జనంన్యూస్. 24నిజామాబాదు.
సెప్టెంబరు 23 రోజు మంగళ వారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీకాంత్ బాబు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ ఆయుష్ డాక్టర్ ప్రమీల దేవి ఆదేశాల మేరకు ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఆర్సపల్లి గ్రామం లో వివేకానంద యోగ కేంద్రం లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ను ప్రారంభిచిన జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్. ప్రారంభించారు. భగవాన్ ధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేశారు, అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరం లో ఔషద మొక్కల ప్రాధాన్యత గురుంచి మరియు వంట ఇంట్లో లభించే వస్తువుల ప్రాముఖ్యత గురుంచి క్లుప్తముగా వివరించడం జరిగింది. మారుతున్న జీవన శైలిలో ఆయుర్వేద ప్రాముఖ్యత గురుంచి వివరించారు,DMHO మేడం మాట్లాడుతూ రోజు రోజుకు ఆయుర్వేదానికి, యోగ కు ప్రాధాన్యత పెరిగిందని తెలిపారు . క్యాంపు జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె గంగా దాస్ మాట్లాడుతూ ధన్వంతరి జయంతి సందర్భంగా ఉచిత ఆయుర్వేద శిబిరం. రక్త పరీక్షలు. షుగర్ , బీపీ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి ఉచితం గా మందులు పంపిణీ చేయడం జరిగింది అని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 246 మంది వినియోగించు కున్నారు. ఈ శిబిరంలో ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ప్రేమలత, మమత, లలిత, జ్యోత్స్న, వెంకటేష్, జయప్రకాష్ తిరుపతి ,మరియు ఆయుష్ డి పి ఎం వందన రెడ్డి ఆయుష్ విభాగం ఫార్మ సి స్ట్లులు న్యవనండి పురు షో తం, వరలక్ష్మీ, స్వరూప, జయరాజ ,ఉమా ప్రసాద్ మురళి, నీరజ, నిరత పారామెడికల్ సిబ్బంది రమేష్, సురేందర్, మహేష్ భిక్ష పతి, పద్మ, లక్షమి,రాజేశ్వర్, లావణ్య. మరియు వివేకా నంద యోగ కేంద్రం అధ్యక్షుడు ఇంద్రకరణ్ రెడ్డి, యోగ ప్రభాకర్, యోగ కిషన్, సిర్ప హన్మాండ్లు, మాజీ ఎంపీటీసీ, యువ నాయకుడు ప్రీతం గ్రామ పెద్దలు అందరూ పాల్గొన్నారు.. గ్రామ పెద్దలకు శాలువాలతో సన్మానించి నారు. వైద్య శిబిరం నకు అందరూ సహకారం అందించి నారు.


