Listen to this article

కాట్రేనికోన : జనం న్యూస్ సెప్టెంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ముమ్మిడి వరం నియోజకవర్గం. లోని రహదారులు సమస్యను మంగళ వారం జరిగిన శాసనసభసమావేశంలో స్పీకర్ దృష్టికి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తీసుకు వెళ్లారు. ప్రధానంగా ముమ్మిడి వరం- కాట్రేనికోన రహదారి (ఇనాపురం మీదుగా) రూ. 23.61 కోట్లు, మురమళ్ళ – ఎదుర్లంక రహ దారి (ఐ పోల వదం మార్గంగా) రూ.1.25 కోటి, కాకి నాడ యానం నేషనల్ హైవే నుండి కాకినాడ-ద్రాక్షా రామ స్టేట్ హైవే (జి వేమవరం నుండి గొర్రిపూడి వరకు) రూ.10.44 కోట్లు వెంటనే మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఇవి ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ పోలవరం, తాళ్ళరేవు మండలాల్లోని అనేక గ్రామాలకు అనుసంధానం కల్పించే అత్యంత కీలకమైన రహదా రులనీ, ఈ రోడ్లు పూర్తిగా పాడై, ఇటీవలి భారీ వర్షాలతో రహదారులు మరింత దెబ్బతిని, ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతోందనీ, ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయన్నారు. ఇది ప్రజల నిత్య జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపు ఉందని ఎమ్మెల్యే వివరిం చారు. ప్రజల రవాణా సౌకర్యం, రక్షణ, ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, పై రహదారి పనులకు తక్షణ నిధులు మంజూరు చేయవలసిందిగా గౌరవ స్పీకర్ ద్వారా రోడ్లు భవనాల శాఖ మంత్రికి తెలిపారు.