Listen to this article

జనం న్యూస్ 29 జనవరి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయంలో ధూప దీప నైవేద్య అర్చకులకు గడిచిన కొన్ని నెలల నుండి వేతనములు లేక ఇబ్బందుల గురవతున్న అర్చకులకు రాష్ట్ర సలహాదారులు హర్కార వేణుగోపాల్ రావు, కమిషనర్ శ్రీధర్ సహకారం రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ కృషి తో బకాయి వేతనాలు విడుదల ద్వార ప్రభుత్వం అర్చకుల కుటుంబాలలో సంతోషాన్ని నింపింది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సుమారు 6,748 అర్చక కుటుంబాలలో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్బన్ని పురస్కరించుకొని ధూప దీప నైవేద్య సంగం ఎల్కతుర్తి మండల అధ్యక్షులు సదా నిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ దేవాలయాల్లోని అర్చకులకు పెండింగ్ లో ఉన్న వేతనాలను ప్రభుత్వం విడుదల చేయడం హర్షనీయమని సంతోషం వెలు బుచ్చారు.అదే విధంగా ధూప దీప నైవేద్య అర్చక సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.