

భక్తులతో కిక్కిరిసిపోయిన చాముండేశ్వరి ఆలయం
జనం న్యూస్ జనవరి 29 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో వెలసిన మంజీరా నదిలో ఉదయం నుండి సాయంత్రం వరకు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ చాముండేశ్వరి దేవికి ఉదయం అభిషేకం నిర్వహించి తదనంతరం పూజలు మరియు హారతి కార్యక్రమం నిర్వహించారు భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల ప్రత్యేకంగా క్యూలైన్లు మరియు మంజీరా నదిలో స్నానాల ఘట్టాలు ఏర్పాటు చేశారు మరియు మహిళలకు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేశారు మాఘ అమావాస్య సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ ప్రధాన అర్చకులు ప్రభాకర్ శర్మ మరియు సుబ్రహ్మణ్య శర్మ మోతిలాల్ శర్మ తదితరులు పాల్గొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు చిలిపి చెడు ఎస్సై మరియు ఏ ఎస్ ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానమాచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీ చాముండేశ్వరి ఆలయం వద్ద ఒక పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు