Listen to this article

బిచ్కుంద సెప్టెంబర్ 27 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని రాజుల్ల గ్రామంలో మాజీ ఎంపీపీ అశోక్ పటేల్ మొదటి వర్ధంతిలో కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే .పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హన్మంత్ షిండే మాట్లాడుతూ ఎంపీపీగా అశోక్ పటేల్ ప్రజలకు ఎనలేని సేవలు చేశారని, ఎటువంటి సమయాల్లోనైనా అందరితో కలగలుపుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిధిని అన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పిట్లం, నిజాంసాగర్, పెద్ద కొడప్గల్, మండలాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.