Listen to this article

ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి (భండా రామ్), జనవరి 29 (జనం న్యూస్):- గిద్దలూరు నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షులుగా నియమితులైన రాచర్ల మండలానికి చెందిన యాళ్ల చంద్ర మోహన్ మార్కాపురం మాజీ ఎమ్యెల్యే , గిద్దలూరు నియోజకవర్గం వైసిపి ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి, పార్టీలో క్రియాశీలక పదవికి తనను ఎంపిక చేసినందుకు కేపీ నాగార్జున రెడ్డి కి, సిఫారసు చేసిన రాచర్ల మండల నాయకులు సి.ఆర్.ఐ మురళి కి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రమోహన్ అభినందించి,పార్టీ అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేయాలని నాగార్జున రెడ్డి సూచించారు.. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వారి వెంట ఉన్నారు.