Listen to this article

జనం న్యూస్, జనవరి 29.01.2025:-గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి కి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు షేక్.దివాన్ భాష (ఆర్ఎంపీ) డాక్టర్ వైద్యునిగా మరియు ప్రజా సేవ సమితి అధ్యక్షుడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి నాటి నుంచి వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా మైనార్టీ కార్యదర్శిగా పనిచేయడం జరిగినది. 2014 వ సంవత్సరంలో వైయస్సార్ అభ్యర్థి గెలుపు కోసం పాటు, 2019 వ సంవత్సరంలో వైయస్సార్ అభ్యర్థి గెలుపు కోసం పాటు, 2024వ సంవత్సరంలో వైయస్సార్ అభ్యర్థి గెలుపు కోసం పాటు, 2014 నుంచి 2019 వరకు కొమరోలు మండల ఇన్చార్జిగా పనిచేయడం పార్టీ కోసం ప్రజల కోసం చాలా కష్టపడి పనిచేయడం జరిగినది. నాకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయిలో గాని,రాష్ట్రం స్థాయిలో గాని పదవి ఇవ్వవలసినదిగా గిద్దలూరు ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి ని విన్నపం చేయడం జరిగినది..