బిచ్కుంద సెప్టెంబర్ 27 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు బి బి ఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ మాజీ శాసనసభ్యులు హనుమంత్ సిందే పాల్గొని తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ఐలమ్మ సేవలు మరువ రానివ్వని పేర్కొన్నారు ప్రతి మహిళ ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేతో పాటు బిచ్కుంద మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరావు దేశాయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాల్చారి రాజు పట్టణ అధ్యక్షుడు ఆవారా శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ ఎన్ బాలాజీ( బాలు) , వైస్ చైర్మన్ యాదవ్ రావు, బసవరాజ్ పటేల్, హాజీ లక్ష్మణ్, ఎన్ శ్రీనివాస్ ,డాక్టర్ రాజు, శంకర్ పటేల్, బొమ్మల లక్ష్మణ్, టిఆర్ఎస్ కార్యకర్తలు రజక సోదరులు తదితరులు పాల్గొన్నారు



