నివాళులు అర్పించిన మున్సిపల్ కమిషనర్ చింత వేణు
జనం న్యూస్- సెప్టెంబర్ 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం లో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాన్ని కమిషనర్ చింతా వేణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కమిషనర్ చింతా వేణు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణా గడ్డ మీద భూమి కోసం,భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం ప్రజలలో చైతన్యం నింపి స్ఫూర్తిని రగిలించిన గొప్ప ఆదర్శమూర్తి అని అందరు ఆమె స్ఫూర్తి తో ఆమె అడుగుజాడలలో నడవాలని ఈ సందర్బంగా ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో నందికొండ మున్సిపల్ కమిషనర్ చింతా వేణు, పెదవుర ఆర్ ఐ దండ శ్రీనివాసరెడ్డి, నందికొండ మున్సిపాలిటీ 5 వ వార్డ్ మాజీ కౌన్సిలర్ హిరేకర్ రమేష్ జీ, ఉద్యమకారుల ఫారం మహిళ కార్యదర్శి కాయతి జానకి రెడ్డి, సపావత్ చంద్రమౌళి నాయక్, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


