జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డిని శుక్రవారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆహ్వానించారు. దసరా పండుగ రోజున అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను అందు కోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ఉపాధ్యక్షులు చలపాటి నరసింహ, మండల కోఆప్షన్ సభ్యులు కరిముల్లా ఖాన్, అక్కిరెడ్డి మోహన్ రెడ్డి, సోమిశెట్టి ప్రభాకర్, కాకి చంద్ర, ఓర్సు శ్రీనివాసులు, బద్రి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


