జనం న్యూస్ సెప్టెంబర్ 27 శాయంపేట
మండల కేంద్రంలో సి యస్ ఐ ఎసెన్షియల్ చర్చి లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా 79 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సంఘ కాపరి పాస్టర్ డి. అనిల్ కుమార్ పాల్గొని జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంబించారు. అనంతరం మాట్లాడుతూ గత 79 సంవత్సరాల నుండి దక్షిణ భారత దేశంలో వివిధ దేశాల్లో విద్య, వైద్య ఆధ్యాత్మిక సేవలను అందిస్తుందని తద్వారా ఎంతోమంది ఈ సేవలను వినియోగించుకొని ఉన్నత స్థితిలో ఉన్నారని, ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉందని తెలియజేశారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ప్రవళిక అమ్మ, చర్చి సెక్రటరీ బి. పౌలు , సంఘ పెద్ద మారపల్లి బాబు , కమిటీ సభ్యులు మారపల్లి మణిమాల, మారపల్లి ప్రభాకర్, దైనంపల్లి మనోజ్ , వర్షిత్, సౌందర్య ప్రజ్వల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


