Listen to this article

బిచ్కుంద సెప్టెంబర్ 27 జనం న్యూస్

పార్టీని నమ్ముకున్న వారికి అండగా ఉంటామని మరోసారి నిరూపించారు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే బిచ్కుంద మండల కేంద్రంలో గోపి గణేష్ అనే కార్యకర్త మృతి చెందడంతో శనివారం గణేష్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని స్వయంగా గణేష్ పాడి మోసారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అన్ని విధాల అండగా ఉంటామన్నారు మాజీ ఎమ్మెల్యే వెంట స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.