Listen to this article

జనం న్యూస్ సెప్టెంబర్ 27 సంగారెడ్డి జిల్లా

అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడ, కృష్ణారెడ్డిపేట్, సూర్యోదయ కాలనీ, భ్రమరాంబ నగర్ కాలనీతో పాటు పలు కాలనీలలో దేవి నవరాత్రి ఉత్సవాల భాగంగా పవిత్ర అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో బిఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – నవరాత్రి వేడుకలు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబమని, తల్లి దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు. అన్నదానం అనేది అత్యున్నతమైన దానం, దీని ద్వారా భక్తి, ఐక్యత, మానవత్వం లపడుతుందని అన్నారు.భక్తులంతా ఉత్సాహభరితంగా పాల్గొని మాతకు పూజలు అర్పించారు. సర్వమత సౌహార్ధం, సమాజంలో ఐక్యతా భావం ఇలాంటి వేడుకల ద్వారా మరింతగా పెరుగుతుందని మాణిక్ యాదవ్ అభిప్రాయపడ్డారు.ప్రజలందరికీ శ్రేయస్సు, అభివృద్ధి, ఐశ్వర్యం కలగాలని తల్లి దుర్గాదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సమాజ సేవలో భాగంగా భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.