జనం న్యూస్, సెప్టెంబర్ 27:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలము:తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – “కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉండి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించింది అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. బీసీలకు రాజకీయ రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలు లభించనున్నాయి” అని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గం నిరంతర కృషితో ఈ నిర్ణయం సాధ్యమైందని అన్నారు. “లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిజాయితీకి నిదర్శనం” అని ఆయన అన్నారు.దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పకడ్బందీగా కులగణన చేపట్టి, బీసీ కమిషన్ సేకరించిన నివేదికల ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయడం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం అవుతుందని పేర్కొన్నారు.బీసీ సమాజం తరఫున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గానికి అధ్యక్షుడు మహేష్ కుమార్ కృతజ్ఞతలుతెలియజేస్తున్నాను” అని మాట్లాడారు.


