Listen to this article

అచ్యుతాపురం(జనం న్యూస్): అచ్యుతాపురం వికలాంగుల ఇంటిగ్రేటెడ్ ఆశ్రమ పాఠశాల నందు ప్రగడ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు హాజరై విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రగడ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందదాయకమని, సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకం అవ్వడం సంతోషించదగ్గ విషయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు రాబోవు రోజుల్లో మరిన్ని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ప్రగడ జగన్నాథరావు, ప్రగడ వీరబాబు, ప్రగడ సంజీవరావు, ప్రగడ దుర్గాప్రసాద్, ప్రగడ పార్వతీదేవి, ప్రగడ రాజు, ప్రగడ చిన్న నాగేశ్వరరావు, ప్రగడ తాతబాబు తదితరులు పాల్గొన్నారు.