Listen to this article

జనం న్యూస్. జనవరి 29. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇన్చార్జ్. (అబ్దుల్ రహమాన్)

శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మెకానికల్ కెమికల్ ఇంజినీరింగ్ విభాగాల విద్యార్థులు అధ్యాపకులు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ (జెస్ట్) స్పాన్సర్ చేసిన ప్రతిష్ఠిత సకురా సైన్స్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంనూ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రోగ్రామ్ జనవరి 19 నుండి 25, 2025 వరకు జపాన్‌లోని కుమమోటో యూనివర్సిటీలో జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ సంజయ్ దూబే తెలిపారు.
కుమమోటో యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ షుయిచీ టోరీ మార్గదర్శకత్వంలో ఏడుగురు విద్యార్థులు ఒక అధ్యాపకుడు కలిగిన బృందం వ్యర్థాలను శక్తిగా మార్పిడి చేసే సాంకేతికతలపై పరిశోధన శిక్షణలో పాల్గొన్నారు అని తెలిపారు. కుమమోటో సిటీలో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి శుద్ధి, ఘన వ్యర్థాలను ఉపయోగకరమైన ఉత్పత్తుల మార్పిడి, వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తిగా మార్పిడి చేసే సౌకర్యాలపై అధ్యయనం చేశారన్నారు . బృందం యూనివర్సిటీ ప్రొఫెసర్లు పరిశోధకులతో పరిశోధన నావీన్యత మార్పిడి కార్యక్రమాలలో పాల్గొన్నారని అన్నారు . బివిఆర్ఐటి కళాశాల
ఛైర్మన్ విష్ణు రాజు కార్యక్రమ బృందాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు కుమమోటో యూనివర్సిటితో పరిశోధన సహకారాలను స్థాపించినందుకు అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విదేశాలతో ఒప్పందాలు శిక్షణ పరిశోధనలను ప్రోత్సహిస్తామని చైర్మన్ శ్రీ విష్ణు రాజు తెలియపరిచారు. వైస్-ఛైర్మన్ శ్రీ రవిచంద్రన్ రాజగోపాల్, సెక్రటరీ ఆదిత్య విస్సం, రీసెర్చ్ డీన్ డాక్టర్ రాజు ఏద్లా, డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మీ ప్రసాద్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సంజయ్ దూబే, డాక్టర్ రాధిక, డాక్టర్ వరుణ్ డాక్టర్ మల్లికార్జున్. విద్యార్థుల బృందం సాధించిన విజయాలపై అభినందించారు.