Listen to this article

జనం న్యూస్ :29 సెప్టెంబర్ సోమవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్;

భావనా ప్రియ సాహితీ వేదిక ఎనిమిదేళ్ల పండుగ సందర్బంగా భద్రాచలంలో సిద్ధిపేట జిల్లాకు చెందిన బండకాడి అంజయ్య గౌడ్ రచించిన శ్రీవేణుగోపాల స్వామి, గుఱ్ఱం జాషువా శతకాలను సూరం శ్రీనివాసులు శతావధాని, అష్టావధాని చిటితోటి విజయ్ కుమార్, మహోపాధ్యాయ శలాక రఘునాథ శర్మ, గురుసహస్రావధాని కడిమిల్ల వరప్రసాద్, ఎన్ సి చక్రవర్తి,భావనా ప్రియ సాహితీ బృందం సభ్యులు ఆవిష్కరించారు. భద్రాచల దేవాలయ సన్నిధిలో అంజయ్య గౌడ్ శతక పుస్తకాల ఆవిష్కరణ పట్ల సిద్దిపేట జిల్లా కవులు ఉండ్రాళ్ళ రాజేశం, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్, పెందోట వెంకటేశ్వర్లు, కోణం పర్శరాములు, కాల్వ రాజయ్య తదితరులు అభినందనలు తెలిపారు.