జనం న్యూస్, సెప్టెంబర్ 29, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
చేర్యాల మండల కేంద్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో చుంచనకోట లో సుతారి భావానీ,రమేష్,కుటుంబ సమేతంగా కొలి పాక కీర్తన, సుతారి సుతారి ప్రీతమ్,పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోగా, స్థానిక భక్తులతో కలసి అమ్మవారికి హారతి ఇచ్చి ఆశీర్వాదాలు పొందారు. మండలంలోని చుంచనకోట గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నవరాత్రి ఉత్సవాలకు కూడా హాజరయ్యారు. అక్కడ గ్రామస్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి, ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా వి జె ఎస్ సి కన్వీనర్ సుతారి రమేష్,మాట్లాడుతూ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు మన సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీకలు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ఆరాధనతో సమాజంలో శాంతి, సౌభ్రాత్రుత్వం, ధైర్యం పెరుగుతాయి. ఇటువంటి పండుగలు గ్రామాల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు చిన్నారులకు మన సంప్రదాయాలను పరిచయం చేస్తాయి. చుంచనకోట గ్రామంలో . ఈ కార్యక్రమాల్లో , గ్రామ పెద్దలు, మహిళలు, , భక్తులు పాల్గొన్నారు.


