జనం న్యూస్ సెప్టెంబర్ 29(నడిగూడెం)
మండల పరిధిలోని సిరిపురం గ్రామం నుండి నారాయణ పురం వెళ్లే ప్రధాన రహదారి కి ఉన్న మూల మలుపు వద్ద దట్టం గా పెరిగిన చెట్ల ను సిరిపురం పంచాయతి సెక్రటరీ ఆదేశాల మేరకు సోమవారం గ్రామ పంచాయతీ సిబ్బంది తొలిగించారు. రహదారి మూల మలుపు వద్ద చెట్లను తొలిగించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ సిబ్బంది అశోక్, సూర్యనారాయణ, గురవమ్మ, తదితరులు పాల్గొన్నారు.


