


వేయేండ్ల శిల్పాల చారిత్రక వేదిక కండ్లపల్లి*
జైనం, శైవం, వైష్ణవ శిల్పాల కండ్లపల్లి
జనం న్యూస్ జనవరి 30 తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, బీర్పూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామంలో 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు వేర్వేరు కాలాలకు చెందిన, వివిధ శైలుల శిల్పాలు పదులకొద్ది వెలుగు చూసాయని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ఆయా శిల్పాలను పరిశీలించి చెప్పారు. కండ్లపల్లి గ్రామంలో దేవాలయ అర్చకుడు, కొత్త తెలంగాణచరిత్రబృందం సభ్యులు వొద్దిపర్తి మధుకుమార్, చిట్నేని విజయకుమార్(టీచర్ ) గ్రామప్రజల సహకారంతో గ్రామంలోని పలుప్రదేశాలను పరిశీలించి, శిల్పాలను గుర్తించారు.
ఈ శిల్పాలలో రాష్ట్రకూటశైలి జైన తీర్థంకరుడు ఋషభుని ధ్యానాసన శిల్పం, మరి రెండు వృషభలాంఛనాలతో ఋషభుని శిల్ప స్తంభాలు, వర్థమహావీరుని అధిష్టానపీఠం, జైనబసది పూర్ణకలశం, 14,15వ శతాబ్దాల శైలిలో గణపతి, కేశవమూర్తులిద్దరు, కుబేరుడు, విష్ణుమూర్తి, మహిషాసురమర్దిని, నాగదేవత, 17,18వ శతాబ్దాల శైలిలో చెక్కిన లోహకారుల దేవత మమ్మాయి శిల్పాలు, గుర్తించడానికి వీలుపడకుండా శిథిలమైన రెండు బహుభుజుల దేవతల శిల్పాలు లభించాయి.
గ్రామంలో గంగధారి కోటయ్య ఇంటివద్ద జైన తీర్థంకరుని శిల్పంతో శాసనస్తంభం బయటపడ్డాయి.
క్షేత్రపరిశీలనలో కండ్లపల్లి గ్రామప్రజలు: గంగాధరి పూర్ణచందర్ గౌడ్, మాజీ సర్పంచ్ పర్వతం రమేశ్ గౌడ్, అర్ ఎం పి వడ్లూరి రవి, పర్వతం శ్రీనివాస్ కోట కిషన్ గౌడ్, గంగధరి శ్రీనివాస్ గౌడ్, గంగధరి శంకర్ గౌడ్, పోతుగంటి శ్యాంసుందర్ గౌడ్, అజ్మీర లక్ష్మణ్, గంగధరి గంగాధర్,
కంది భీమన్న పాల్గొన్నారు.
అద్భుతమైన వారసత్వ సంపదను పరిరక్షించి బావి తరాలకు మన ఘన చరిత్ర ను తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఈ దిశ లో చరిత్రను, చారిత్రక ప్రదేశాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక విశేషాల్ని సరియైన నిర్ధారణ లతో ఆవిష్కరించింది అని కొత్త తెలంగాణ చరిత్ర బృంద కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం జగిత్యాల జిల్లా చిట్నేని విజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అర్చకులు వొధ్ధిపర్థి మధు కుమార్ చార్యులు పాల్గొన్నారు.
క్షేత్ర పరిశీలన: వొద్దిపర్తి మధుకుమార్-9704605620, చిట్నేని విజయకుమార్-9493473774, కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు
ప్రతిమాలక్షణ పరిశోధన, వివరణ: శ్రీరామోజు హరగోపాల్, 9949498698 కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్రబృందం