Listen to this article

జాగో తెలంగాణ వ్యవస్థాపకులు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ 29
.
జహీరాబాద్ పట్టణంలో పూర్వపు వాగులు ఎన్జీవోస్ కాలనీ నుండి మోహన్ థియేటర్ పక్కనుండి శ్రీనగర్ కాలనీ మీదుగా వెళ్లే సహజమైన వాగు పూర్తిగా కబ్జాకు గురై అదేవిధంగా శివాలయం నుండి బాగా రెడ్డిపల్లి రాచన్నపేట్ ఆర్య నగర్ అంగడి బజార్ నుండి వెళ్లే వాగు పూర్తిగా గబ్జకు గురైంది కొంతమంది అక్రమార్కులు ఏకంగా వాగులపైనే కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మాణం చేసి ప్రజలకు అద్దెకిస్తున్నారు ఇంకా కొంతమంది అక్రమార్కులు తమ వ్యాపారాలకు అడ్డువస్తున్నాయని మురికి కాలువనులను పూర్తిగా మూసివేసినారు ఇలా మూసివేయడంతో మురికి నీరు వర్షపు నీరు వెళ్లకుండా ఎక్కడికక్కడ పట్టణంలోని కాలనీలలో ప్రజల నివాసాలలో నిలిచిపోయి మంచినీటి బోరుబావులలో మంచినీటి పైపులైన్ లలో చేరి కోట్ల రూపాయలు విలువ చేసే మంజీరా నీటిలో సైతం చేరి ప్రజలు తాగడానికి ఆయుష్టంగా తయారై మంచినీటిని కూడా కాలుష్యాన్నికి గురి చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితులలో కోట్ల రూపాయలు వేచించి ప్రజలకు అందిస్తున్న నీటిని సామాన్య ప్రజలు ఎవరు కూడా తాగడం లేదు దీని మూలంగా ఎలాంటి లైసెన్స్ లేని మినరల్ వాటర్ ప్లాంట్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చి ప్రజల ధనాన్ని కాజేస్తున్నాయి కొంతమంది తెలిసి తెలియక ఈ నీళ్లను తాగడంతో అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు వీటికి తోడుగా మురికి కాలువలు పూర్తిగా మూసివేయడంతో మురికి నీరు వర్షపు నీరు మురికి కాలువలో నుండి వెళ్లకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి వాగులు మురికి కాలువల కబ్జాలను కాపాడులేని పురపాలక సంఘం నీటిపారుదల వ్యవస్థ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలు పడుతున్న బాధలను చూచి చూడనట్లు వ్యవహరిస్తున్నాయి ముఖ్యంగా ఇప్పుడు దసరా దీపావళి క్రిస్టమస్ సంక్రాంతి రంజాన్ పండగలు వస్తున్నాయి ప్రధానంగా హిందువులకు అతి పెద్ద పండుగ దసరా పండగ ఈ పండుగకు జహీరాబాద్ ప్రజలందరూ భవాని మాత ఆలయం వెనుక లో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి నుండి శివాలయం వెళుతుంటారు శివాలయం వైపు నుండి భవాని మాత ఆలయం కు వస్తూ ఉంటారు ఈ దారిలో రైల్వే అండర్ బ్రిడ్జి గత నాలుగు రోజుల నుండి నిండుకుండలా నిండిపోయింది దాని దిగువన ఉన్న వాగులు మురికి కాలువలు ఎక్కడికక్కడ కబ్జాయి పూర్తిగా మురికితో నిండిపోయి ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో అండర్ బ్రిడ్జి కింది నుండి వర్షపు మురికి నీరు ఎటు వెళ్లలేని పరిస్థితి కావున అతిపెద్ద పండుగ దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని పురపాలక సంఘం అధికారులు పురపాలక సంఘం స్పెషల్ అధికారి ఇరిగేషన్ అధికారులు కబ్జాల గురైన కాలువలను వాగులను కబ్జాదారుల నుండి విడిపించి వాగులను వాగుల వలె మురికి కాలువను మురికి కాలువల వలె చేసి ప్రజలకు అందించాలని జహీరాబాద్ ప్రజల పక్షాన పి. రాములు నేత జాగో తెలంగాణ వ్యవస్థాపకులు మరియు కార్యవర్గ సభ్యులు మహమ్మద్ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్ల దశర అరవింద్ గార్లు అధికారులను కోరుతున్నారు