జనంన్యూస్. 29.సిరికొండ.ప్రతినిధి.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల ప్రజల ఆశల ప్రతినిధిగా, యువతకు దిశానిర్దేశకుడిగా, నేషనల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెడ్పిటిసి ఎన్నికల్లో పోటీ బరిలో అడుగుపెట్టిన యువనాయకుడు మోతి నవీన్ రెడ్డి.
చిన్ననాటి నుండే సేవా భావం గల హృదయంతో, ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలుస్తూ, ప్రతి సమస్యకు పరిష్కారం చూపే వ్యక్తిగా ఆయన పేరు నిలిచింది. ప్రజలే నా బలం – సేవే నా లక్ష్యం అని సంకల్పం చేసుకున్న ఆయన, ఈ బాటలో నడుస్తూ ఇప్పుడు అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్లడానికి జెడ్పిటిసి బరిలో అడుగుపెట్టారు.మోతి నవీన్ రెడ్డి ప్రాధాన్య అంశాలు:ప్రతి గ్రామంలో అభివృద్ధి – ప్రతి ఇంటిలో వెలుగులు. పక్కా రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, పాఠశాలలు, ఆసుపత్రులు అభివృద్ధి.యువతకు ఉపాధి అవకాశాలు – మహిళలకు ఆర్థిక స్థిరత్వం.రైతుల సంక్షేమం – పాడిపంటలకు న్యాయం.సమాన హక్కులు – అందరికీ సమాన అభివృద్ధి. ప్రజలే నా పార్టీ – సేవలే నా రాజకీయం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మోతి నవీన్ రెడ్డి ఉంటారు. ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఈ యువ నాయకుడి విజయమే ఇప్పుడు ప్రజల విజయమని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు.ప్రజల ఆశీర్వాదమే నా విజయం…ప్రజల సమస్యలే నా పథకం…ప్రజలే నా బలం – సేవే నా లక్ష్యం! నూతన ఆలోచనలు – యువ శక్తి – అభివృద్ధి ధ్యేయం.ఈ మూడు నినాదాలతో మోతి నవీన్ రెడ్డి జెడ్పిటిసి పోటీలో దూసుకుపోతున్నారు.ప్రజా ఆశీర్వాదాలతో ఆయన విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని మండల వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.


