

జనం న్యూస్ జనవరి 30 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- మునగాల మండల కేంద్రానికి చెందిన బీసీ సంఘం మండల అధ్యక్షులు చింతకాయల నాగరాజు కుమార్తె శ్రావ్య పుట్టినరోజు సందర్భంగా బుధవారం మునగాల మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబం అనారోగ్య కారణంగా బాధపడుతున్న వెంగళం రాంబాయమ్మ కు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఆ ఒక్క రోజు ఆ ఖర్చును ఇలా ఏదో ఒక రూపాన పేదలకు అందించడం మంచిదని అన్నారు.ఈ కార్యక్రమంలో తాటికొండ సురేష్ కాలేశ్వరరావు పాల్గొన్నారు.