జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు: అధికార పార్టీ వలన ఇబ్బంది పడ్డ పార్టీ కార్యకర్తలకు ఎవరైతే అధికారం అడ్డం పెట్టుకొని అక్రమాలు చేస్తున్నారో వారిని చట్టపరంగా న్యాయపూర్వక పోరాటం చేసేందుకు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ ని మండల కన్వీనర్ సిద్దవరం గోపిరెడ్డి, స్థానిక నాయకులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సిద్దవరం గోపి రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ బుక్ ని రెండు మార్గాల్లో వినియోగించ వచ్చని https:// .weysrcp.కామెంట్ ని కానీ, ఐ వి ఆర్ ఎస్ నెంబర్ 040-49171718 ద్వారా కానీ ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.ఈ బుక్ లో కార్యకర్తలు తమ కు జరిగిన అన్యాయాలను, రాజకీయ దాడులను వివరాలను ఫోటో లు, వీడియోలు ఆధారాలతో సహా అప్లోడ్ చేయవచ్చని తెలిపారు. అందిన ప్రతి ఫిర్యాదును డిజిటల్ గా భద్రపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో వైఎస్ఆర్సిపి నాయకులు గొబ్బిళ్ళ త్రినాథ్, నడివీధి సుధాకర్, పల్లె గ్రీష్మంత్ రెడ్డి, మోహన్ రెడ్డి, గుండు మల్లికార్జున్రెడ్డి, ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి, బూసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి నరసింహారెడ్డి, మోడపోతుల సుధా,ఉప సర్పంచ్ ఇబ్బు, ముమ్మడిశెట్టి సుధాకర్,గోల్డ్ మస్తాన్, మహబూబ్ బాషా,విజేయుడు, దుర్గయ్య, అరవింద్, భాష, తదితరులు పాల్గొన్నారు.


