Listen to this article

జనంన్యూస్. 30.నిజామాబాదు.ప్రతినిధి.

నిజామాబాదు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ వన్ ఫలితాలలో 386వ ర్యాంకు సాధించి డీఎస్పీ శిక్షణకు ఎంపికైన నిఖిత రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిఖిత రెడ్డిని శాలువాతో సత్కారించి పుష్పగుచ్చం అందించి అభినందించడం జరిగింది.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు గుత్ప గ్రామానికి చెందిన నిఖిత సామాన్య రైతు కుటుంబంలో జన్మించి శ్రమను ఆయుధంగా మలుచుకొని కస్టపడి మొదట ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్ (AE) ఉద్యోగం సాధించి అంతటితో ఆగిపోకుండా సమాజానికి మరింత సేవా చేయాలనే సంకల్పంతో గ్రూప్ వన్ లో డీఎస్పీ ర్యాంకు సాధించడం ఇందూర్ జిల్లాకు గర్వకారణం అన్నారు.నిఖిత సాధించిన ఈ విజయంతో జిల్లా పేరు ప్రతిష్టలను నలుమూలలకు చాటరన్నారు. నేటి యువతరం నిఖితను ఆదర్శంగా తీసుకోని ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు.
నిఖిత భవిష్యత్ లో డీఎస్పీగా సమాజానికి ఉత్తమ సేవాలాందిస్తూ ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఇందూర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆశీర్వదించారు.నిఖిత రెడ్డి డీఎస్పీగా ఎంపికపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసారు.