Listen to this article

జనంన్యూస్. 29. నిజామాబాదు. ప్రతినిధి.

ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్నా మహాకుంభమేళకు నిజామాబాదు .అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. కుటుంబ సమేతంగా వెళ్లడం జరిగింది.
మౌని అమావాస్య రోజున ప్రయాగ్ రాజ్ లోని గంగ, యమున, సరస్వతి నదుల పవిత్ర కలయిక అయిన త్రివేణి సంఘామంలోని కుటుంబ సమేతంగా పవిత్ర స్నానాలు ఆచరించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా అన్నిటికంటే అతి పవిత్రమైనది అని అతి పెద్ద సాధు, సన్యాసుల కలయిక ఈ మహా కుంభమేళా అన్నారు.ప్రయాగ్ రాజ్ త్రివేణి సంఘామంలో స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం, మోక్షం లభిస్తుందని భక్తులందరి నమ్మకం అన్నారు.
ఈ కుంభమేళాకు దేశ నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులు కోట్ల సంఖ్యలో రావడం ప్రపంచ వ్యాప్తంగా మన సనాతన హిందూ ధర్మాన్ని ప్రతిబింభించేల ఉందన్నారు.
సామాన్య భక్తులకు సైతం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి తెలంగాణ భక్తులందరి తరపున ధన్యవాదములు తెలిపారు.