Listen to this article

(జనం న్యూస్ చంటి సెప్టెంబర్ 30)

దుబ్బాక మండలంలోని హబ్సీపూర్ గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రులలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు శ్రీ మహంకాళి యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కత్తి కార్తిక గౌడ్ అక్క గారు విచ్చేసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మండపంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామ ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కొత్త దేవి రెడ్డి , కామోజీ అనురాధప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సవాలకు మరింత శోభ తీసుకొచ్చారు.