జనం న్యూస్ సెప్టెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆంధ్ర ప్రదేశ్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్న విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గత ఆరు సంవత్సరములుగా అపరి ష్కృతంగా ఉన్న భాషా పండితుల సమస్యను పరిష్కరించుటకు సానుకూలతను ఎమ్మెల్సీ ల ద్వారా తెలియపరచినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీఈవో ఫూల్ భాషా పండితులందరూ ఉభయగోదావరి జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ ద్వారా తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ గౌరవ విద్యాశాఖ మాత్యులు నారా లోకేష్ వారి కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వీరిలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వీధి వెంకటేశ్వర రావు, అడపా సూర్య కుమారి , తెలుగు నాడు ఉపాధ్యాయ సంఘం కోనసీమ భాద్యులు కొపనాతి భగవాన్ రామచంద్ర వర్మ శానాపతుల లోవలక్ష్మి , కొల్లు సుజాత , కే బి వి ఎల్ అన్నపూర్ణ, సాధిక్ , గణేష్ కుమార్ , రమేష్ ,, వెంకట రాణి , మరియు తదితరులు కలిశారు


