

జనం న్యూస్. జనవరి 29. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాన్ఫరెన్స్ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో. మెదక్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ మాట్లాడుతూ. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పై వ్యక్తి గత ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. బి ఆర్ ఎస్ నాయకులపై దాడులు చేస్తామని బెదిరిస్తున్న నాయకుల్లారా కబర్దార్ అని మండిపడ్డారు. సునీతా లక్ష్మారెడ్డి బుకబ్జాలు చేశారనే ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే బూ కబ్జాకు పాల్పడుతున్న రని ఎద్దేవా చేశారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయంలోనే నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు గడిచిన ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా చేపట్టలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయక పోవడం సిగ్గుచేటన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికి నల్లా ఏర్పాటు చేసి మంచినీటి సమస్య తీర్చామన్నారు. ప్రతి తండాలో సీసీ రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రంలో ఎటు చూసినా అభివృద్ధి కేవలం కెసిఆర్ పాలనలో జరిగిందని తెలిపారు. .కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను నమ్మించి మోసం చేస్తుందని అన్నారు.