

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 29 రిపోర్టర్ సలికినిడి నాగరాజు
హైదరాబాద్ కు చెందిన మౌనిక అనే మహిళ నరసరావుపేటలోని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను వేడుకుంది. చిలకలూరిపేట సాంబశివ నగర్ కు చెందిన పుల్లగుర సందీప్ తో 10 ఏళ్ల క్రితం వివాహమైందన్నారు. అయితే గత రెండేళ్లగా వేరోక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపించింది. పిల్లలను చదివించుకుంటూ వారింట్లో నివాసం ఉంటున్న తనను బెదిరిస్తున్నారని తెలిపింది. పిల్లలతో పాటు తనకు ఎటువంటి ప్రాణహాని జరిగిన భర్తదే పూర్తి బాధ్యత అన్నారు.