జనం న్యూస్,అక్టోబర్01,అచ్యుతాపురం:జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవా సమితి ఆధ్వర్యంలో అచ్యుతాపురం మండలం పూడి ఆర్అండ్ఆర్ కాలనీ వైఎస్ఆర్ నగర్ లో ఎంపియూపి స్కూల్ నందు అక్టోబర్ 2 ఉదయం 9గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రక్త దాన శిబిరం నిర్వహించడం జరుగుతుందని,యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొనాలని రక్త దానం శిబిరం నిర్వాహకులు రాజాన సంజీవ్ మరియు వారి మిత్ర బృందం కోరారు.


