Listen to this article

జనం జనవరి 30 ( బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా )

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లు గారి మహేష్,ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ప్రజా యుద్ధానికి గద్దర్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా యుద్ధానికి గద్దర్ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని యూత్ కాంగ్రెస్ తరఫునుండి డిమాండ్ చేస్తున్నాం.
బీబీపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లు గారి మహేష్,
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో కేంద్రంలోని ప్రజా యుద్ధానికి గద్దర్ పైన కేంద్ర సహాయం మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ, చరణ్ రెడ్డి, అలాగే ఇలియాస్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మధుసూదన్, ఆదేశాల మేరకు నేడు బీబీపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లు గారి మహేష్, ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి కేంద్రమంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుతార్ రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, అలాగే బీబీపేట్ మండల ఆల్ విలేజ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే యూత్ కాంగ్రెస్ సైనికులు, కార్యకర్తలు,పాల్గొనడం జరిగింది.