Listen to this article

బతుకమ్మ పాపన్నపేట.

సెప్టెంబర్.30(జనంన్యూస్)

మండల కేంద్రమైన పాపన్న పేటతో పాటు వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు రకరకాల పూలను పేర్చి బతుకమ్మగా తీర్చిదిద్ది గ్రామ కుడల్ల వద్ద ఉంచి బతుకమ్మ పాటలతో లయబద్ధంగా ఆడుతూ మహిళలు ఎంతో ఆనందంగా గడిపారు. అనంతరం గ్రామ చెరువుల వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు.