

జనం న్యూస్ జనవరి 29 నడిగూడెం
గ్రామాల్లో పార్టీ పటిష్టతకు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుండు మహేందర్ గౌడ్ అన్నారు.బుధవారం మండలంలోని బృందావనపురం, కేశవాపురం గ్రామాలలో జరిగిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఆయా గ్రామాల యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.బృందావనపురం యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కాసాని శ్రీను,ఉపాధ్యక్షుడిగా పొలంపల్లి చందర్ రావు,ప్రధాన కార్యదర్శిగా మామిడి మహేష్,కేశవాపురం యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శివరాత్రి ఉపేందర్,ఉపాధ్యక్షుడిగా షేక్ రషీద్, ప్రధాన కార్యదర్శిగా చింత త్రిమూర్తి, కార్యదర్శిగా దారా రాజు, కోశాధికారిగా సుంకోజు కరుణాచారి, పనస మహేష్ లను ఎన్నుకున్నారు.ఈ
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బొడ్డు గోవర్ధన్,కటికల పుల్లయ్య, పిఎసిఎస్ మాజీ చైర్మన్ పుట్టా రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపాల పురుషోత్తం,పుట్టా చంద్రయ్య,పుట్టా శీను,పుట్టా చిరంజీవి, కంభంపాటి శ్రీనివాస్, కంభంపాటి చైతన్య, కాసాని పెద్ద బిక్షం, చింతల నాగేశ్వరరావు అర్జున్ రావు, సుబ్బారావు, ప్రసాద్,ఉపేందర్,గోపయ్య, అంజి పాల్గొన్నారు…