Listen to this article

బిచ్కుంద అక్టోబర్ 1 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సీనియర్ నాయకులు శంకర్ పటేల్ మరియు వ్యవసాయ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ కొంగల్ శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం రైతులు కష్టించి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుక వచ్చి మద్దత్తు ధర పొందాలని అన్నారు. రైతులు వరి ధాన్యాన్ని 17 శాతం తేమతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, దళారీలకు విక్రయించి మోసాలకు గురికావద్దని ఆయ నన తెలిపారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు కలుగనీయకుండా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులకు గన్ని సంచుల కొరత, ఇతరత్రా సమస్యలు ఉంటే నేరుగా తనకు ఫోన్‌ చేయాలని ఆయన కోరారు. ఈ కొనుగోలు కేంద్రాలను రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ సిద్రాం పటేల్ ,రాజు పటేల్ ,వీరు పటేల్ ,నర్సారెడ్డి ,సర్పంచ్ జీవన్,సంతోష్ రెడ్డి,మన్ను,పంచాయతీ కార్యదర్శి యశ్మీన్,ఐకేపీ సిబ్బంది,రైతులు,గ్రామస్తులు పాల్గొన్నారు