Listen to this article

జనం న్యూస్ జనవరి 30 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపల్లి గ్రామంలోని నాయకపు గూడెంలో త్రాగు నీరు కు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మేల్సీ టి జీవన్ రెడ్డి దృష్టికి తీసుకు పోగా. వెను వెంటనే బోర్ వెల్స్ మంజూరు చేసి బోర్ వెల్స్ వేసి మోటార్ ద్వారా వాటర్ ట్యాంక్ లోకి నీరు నింపి నాయకపు గుడెం ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చేసిన ఎమ్మేల్సీ టి జీవన్ రెడ్డి నాయకఫు గుడెం ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామా కాంగ్రెస్ పార్టీ నాయకులు .తొగిటి సురేందర్ చెట్ల శేఖర్ వూరడి రాజేందర్ నాయకపు గుడెం ప్రజలు తదితరులు పాల్గొన్నారు