Listen to this article

రావణ దహనం, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి

ముఖ్యఅతిథిగా పటాన్ చేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్

జనం న్యూస్ అక్టోబర్ 03 సంగారెడ్డి జిల్లా

అమీన్పూర్ మండల పరిధిలోని బీరంగూడ గ్రామంలో దసరా పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏడాది భక్తులు, గ్రామస్థులు ఎదురుచూసే దసరా వేడుకలు ఈసారి మరింత జాతర వాతావరణంలో జరిగి ప్రజలను ఆకట్టుకున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసి గ్రామ ప్రజలతో కలిసి ఈ వేడుకలను ఘనంగా జరిపారు. ముఖ్యాకర్షణగా రావణ దహన కార్యక్రమం అంబరాన్నంటింది. పండుగ వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రావణాసురుడి విగ్రహాన్ని దహనం చేయడంతో ప్రజలు హర్షధ్వానాలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంలో ఆకాశాన్ని చీల్చిన పటాకులు, బాణసంచా ప్రదర్శనలు చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. సంగీత విభావరి రాజ్ కుమార్ బృందం నిర్వహించిన వినోదాత్మక సంగీత కచేరీకి ప్రజలు అప్రతిహతంగా స్పందించారు. ప్రముఖ గాయని మౌనిక యాదవ్ తన మధుర గానంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసి కేరింతలు కొట్టేలా చేశారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పటాన్చెరు కాంగ్రెస్ కానిస్టెన్సీ ఇంచార్జ్ టాటా శ్రీనివాస్ గౌడ్ రావణ దహన కార్యక్రమంలో పాల్గొని దసరా పండుగకు ప్రాధాన్యతను వివరించారు. సమాజంలో చెడును నిర్మూలించాలనే సంకల్పానికి ప్రతీకగా ఈ వేడుకలు ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నె రవీందర్ గోపాల్ రెడ్డి, బిక్షపతి, మాజీ కౌన్సిలర్ మున్నా,బీజేపీ అసెంబ్లీ కన్వీనియర్ అద్దెల్లి రవీందర్, గ్రామ ప్రజలు, పలు కాలనీల వాసులు పెద్దఎత్తున పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది..పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు, సందర్శకులతో బీరంగూడ ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయి పండుగ జాతర వాతావరణాన్ని తలపించింది.బీరంగూడ దసరా ఉత్సవాల్లో బీజేపీ నేత అద్దెల్లి రవీందర్ హాట్ కామెంట్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని బీరంగూడ గ్రామంలో నిర్వహించిన దసరా పండుగ వేడుకల్లో బీజేపీ అసెంబ్లీ కన్వీనియర్ అద్దెల్లి రవీందర్ హాట్ కామెంట్ చేశారు.ఉత్సవాల్లో గాయకుడు రాజ్ కుమార్ ఆలపించిన “మూడు రంగుల జెండా పట్టి సింహములే కదిలినాడు” అనే పాటకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఎద్దేవ చేశారు.“భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దయతో కాటా శ్రీనివాస్ గౌడ్‌కు తప్పకుండా న్యాయం జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని రవీందర్ వ్యాఖ్యానించారు.