జనం న్యూస్ అక్టోబర్ 3 నడిగూడెం
మండలం లోని రత్నవరం గ్రామం లో గత బిఆర్ ఎస్ ప్రభుత్వం రైతుల కోసం నిర్మించిన రైతు వేదిక నేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా గా మారిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం అయితే చాలు మందు బాబులకు ఆ రైతు వేదిక వైన్స్ షాప్ ల మారిపోతుంది. రైతుల సమస్యల పరిష్కారం, రైతులకు వివిధ పంటలపై అవగాహనా కలిపించడం కోసం నిర్మించిన రైతు వేదిక రైతులకు కాకుండా మందు బాబులకు ఉపయోగ పడుతుంది. ఈ రైతు వేదిక చుట్టూ ప్రహరి గోడ నిర్మించక పోవడం తో మందు బాబు లకు ఒక వరం గా మారింది. తక్షణమే అధికారులు స్పందించి రైతు వేదికకు ప్రహరీ ఏర్పాటు చేసి రైతు వేదికలో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


