

ప్రజా సేవ చేయడం కోసమే సర్పంచ్ గా పోటీ చేస్తున్నా
ప్రజలు ఆశీర్వదిస్తే… గ్రామాని అభివృద్ధి చేస్తా
నడిగూడెం, జనం న్యూస్ అక్టోబర్ 4 మండలం లోని రామాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్ బీసీ కావడంతో ఎన్నికల బరిలో ఉంటానని బిజెపి మండల అధ్యక్షులు బండారు వీరబాబు యాదవ్ స్పష్టం చేశాడు.ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాడు. ఆయన విద్యావంతుడు, స్నేహశీలి,మృదు స్వభావి, అందరిలో కలిసిపోయే మనస్తత్వం,గ్రామం లో అత్యధిక ఓటర్లు ఉన్న యాదవ్ సామాజిక వర్గంలో మంచి పేరు ఉండటం తో పాటు యువకుడు కావడం యువకులతో మంచి పరిచయాలు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. ఉద్యోగరీత్యా ఆయన పట్టణం లో ఉండటం తో ఆయనకు గ్రామ ఉద్యోగస్తులతో పరిచయాలు, ఆయన కుటుంబానికి గ్రామం లో మంచి పేరు ఉండటం అయన కు సానుకూలంగా మారబోతుంది. అతి కొద్దీ కాలం లోనే జాతీయ పార్టీ బీజేపీ మండల అధ్యక్షుడు కావడం ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు బండారు కవిత రెడ్డి సపోర్ట్ ఆయన కు ప్లస్ గా మారుతుంది. 2008 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 21 సంవత్సరాల వయసులోనే నామినేషన్ వేసి ఊరిలో సంచలనంగా మారాడు ఆనాటి పరిస్థితి లను బట్టి నామినేషన్ ఉపసమరించు కోవడం జరిగిందని, ఇప్పుడు రిజర్వేషన్ బిసి కావడంతో ఈ అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాడు.