ధాన్యం దళారుల పాలు కాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
జనంన్యూస్.05.సిరికొండ.ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో రైతులు వరి కోత ప్రారంభించినారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు ప్రకృతి వైపరీత్యా అకలా వర్షంతో పెద్ద మొత్తం మీద పంటలు దెబ్బతిన్నవి. సోయా. మొక్కజొన్న. రైతులకు కన్నీరే మిగిల్చినవి.. కనీసం వడ్లను ఆరబెట్టుకోవడానికి కూడా స్థలము లేక అయోమయంలో రైతన్న. మిగిలిన వరి పంటలకైనా సకలములో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక అధికారులు రైతుల మీద ధ్యాస పెట్టి కలెక్టరు కు వరి పంటకు సంబందించి నివేదిక పంపించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వ అధికారులు. స్థానిక నాయకులు ప్రయత్నం చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.


