Listen to this article

సబ్బు టైటిల్ జెడ్పిటిసి అభ్యర్థిగా మంతెన సమ్మయ్య

(జనం న్యూస్ 6 అక్టోబర్, ప్రతినిధి కాజీపేట రవి)

చెన్నూరు నియోజకవర్గం భీమారం మండలనికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన సమ్మయ్య. ఈ సందర్భంగా మాట్లాడుతూ.సుమారు 8 సంవత్సరాలనుండి పాత్రికేయునిగా, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తూ భీమారం మండల ప్రజల సమస్యలపై అనునిత్యం అధికారులకు చేరావేసేలా అలాగే సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడడం తన బాధ్యతగా తీసుకోవడం గొప్పతనంగా భావించవచ్చు.
ఇలాంటి ఎన్నో పలు సమస్యలపై, పత్రిక లో, వార్తల రూపంగా, అధికారులను, నేరుగా సంప్రదించి పనులు చేయించి సమ్మన్న ప్రజలకు ఒక నమ్మకాన్ని, ఒక భరోసాను కలిగించడం విశేషం.గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో,అయితే పలు కథనాలు రాయడం తో, పలుమార్లు బెదిరింపులు వచ్చిన ప్రజల పక్షాన నిలబడి వెనుకడుగు వేసేది లేదనట్టు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఆత్మ స్థైర్యం తో, నిలబడి ఎక్కడ ప్రలోబాలకు లొంగకుండా, ప్రజల సమస్యలే తన సమస్యలు గా భావించి మండలం లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
గత మాజీ ఎమ్మెల్యే పై చెన్నూర్ నియోజకవర్గం లో, ఆనాడు జరుగుతున్న అక్రమాలకు, అరాచకాలకు, చరమగితం పాడాలని, నామ రూపాలు లేకుండా పోతావని,ఏకంగా ఒక టీవీ ఛానల్ లోనే, తన గొంతును వినిపించడం అప్పట్లో సంచలనం అయింది. దానితో, కేసులని, ఫోన్ లలో బెదిరింపులు వచ్చిన జంకాలేదు.అప్పటి నుండి అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ పరంగా ఎమ్మెల్యే అభ్యర్థి ని సైతం వెంటేసుకోని, చెన్నూర్ నియోజకవర్గం మొత్తం ప్రచారం చేసుకుంటూ పల్లె పల్లెలో,మార్పు రావాలంటే, కాంగ్రెస్ పార్టీ గెలవాలని, పెద్ద వేదికల ద్వారా గొంతును వినిపించడం జరిగింది.ఇలాంటి సమయంలో, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కుటుంబం సైతం అనారోగ్యంతో 45 రోజులు ఆసుపత్రిలో,పాలైనా.గుండెను బండ రాయి చేసుకొని,ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రములో, చెన్నూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలని నిరంతరం అందరితో సంప్రదింపులు చేయడం మాత్రం ఆపలేదు.తీరా!ఎలక్షన్ కి ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఆర్ ఎస్ పార్టీలోకి వెళ్లిన నమ్ముకున్న సిద్ధాంతం కోసం దేనికి ఆశపడకుండా ఎవరు వచ్చిన నన్ను గుర్తించక పోతారా.అని ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ లోనే ఉండడం, ప్రజలతో, యువకులతో, ఎప్పటికప్పుడు,వారితో, బిడ్డగా, తమ్మునిగా, అన్నగా ఉంటు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆణువణువూలో, వెన్నంటే ఉంటు సమ్మన్న కు సమస్య చెప్తే తప్పకుండా పరిష్కారం చేస్తాడు. అనే దృడమైన నమ్మకం బలమైన ప్రజా గొంతుకగా పేరు తెచ్చుకున్నాడు.ఇప్పుడు తెలంగాణ రాష్ట్రములో,స్థానిక ఎన్నికలకు సర్కార్ పచ్చ జెండా ఉపడంతో, ఆశ చిగురించింది.దీనితో, భీమారం మండలం ఎస్ సి జెడ్పిటిసి రావడం సంతోషంగా ఉందని, భీమారం మండల ప్రజలకు సేవ చేయడానికి మరింత నాకు ఆయుధం అవుతుందని,కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే, మరియు రాష్ట్ర మంత్రి గడ్డం. వివేక్ వెంకటస్వామి అవకాశం కలిపించాలని, ఒక దళిత మాదిగ జాతి బిడ్డగా కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిగా చేతులు జోడించి కోరుకుంటున్నాను.అలాగే భీమారం మండల ప్రజలు అవకాశం కలిపిస్తే జెడ్పిటిసిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, మండల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ అందరితో కలిసి,అన్ని రంగాల్లో ముందుకు తెచ్చే విధంగా ముఖ్యంగా యువతకు అన్నిరకాల శాయశక్తుల కృషి చేస్తానని అందరూ నాపై దయవుంచి నాకు ఒక అవకాశం ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తూ దీవించాలని కోరడం జరిగింది.