జనం న్యూస్ నడిగూడెం అక్టోబర్ 06
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామని రత్నవరం గ్రామ శాఖ అధ్యక్షుడు సోమగాని రవి పిలుపునిచ్చారు. సోమవారం జరిగిన గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ను ప్రజలందరూ నమ్ముతున్నారని ఆయన అన్నారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు,ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, వంటి పథకాలతో పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు. గ్రామంలో పార్టీ లకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.


