

జనం న్యూస్ జనవరి 29 అమలాపురం
జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బిజెపి నాయకులు యళ్ల దొరబాబు
: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బిజెపి నాయకులు యళ్ల వెంకట రామ మోహన్ రావు దొరబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆ ఘటన దురదృష్టకరం. 20మంది భక్తులు చనిపోయారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. చాలా బాధాకరం. మన తెలుగు రాష్ట్రాల నుంచి మహా కుంభమేళాకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ప్రభుత్వ అధికారుల సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ బీజేపీ నాయకులు యళ్ల దొరబాబు అన్నారు